పాలపిట్టను బంధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
సీఐ వెంకటేశ్వర్లు
ఆమనగల్లు రంగారెడ్డి:
విజయదశమి పండుగను పురస్కరించుకొని పాలపిట్ట ను ఎవరైనా బంధించిన, ప్రదర్శించిన చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం పాలపిట్ట సంరక్షణపై ముద్రించిన వాల్ పోస్టర్లను ప్రదర్శించి ప్రజలకు వన్యప్రాణి సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. పాలపిట్టను దర్శించుకోవాలని సాంప్రదాయం పేరుతో దానిని బంధించిన, గాయపడినట్లు కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయన రౌడీ షీటర్ల కు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రస్తుత కార్యకలాపాలు, వృత్తి, ఉపాధి వివరాలను పరిశీలించిన ఆయన సత్ప్రవర్తనతో మెలగాలని నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని శాంతిభద్రతలకు భంగం కలిగించరాదని సూచించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజలు పండుగను ప్రశాంత వాతావరణంలో సోదర భావంతో జరుపుకోవాలని బహిరంగ ప్రదేశాలలో గొడవలు, అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమాలలో ఎస్సై సంతోష్ రెడ్డి, అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎ, చంద్రశేఖర్ మేజర్ న్యూస్.