నీటి సమస్య పరిష్కారానికి బోరు ఏర్పాటు..
రామాయంపేట ; నిజాంపేట మండల కేంద్రంలోని 7, 9,వ వార్డులలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో శనివారం బోరు వేయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరేందర్ మాట్లాడుతూ.. 7,9,వ వార్డులో నీటి సమస్యను గుర్తించి, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా బోరు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు, వార్డు సభ్యులు నాయిని లక్ష్మణ్, దుర్గయ్య, బండారి ఎల్లం, మల్లేశం,గ్రామస్తులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, సామల మహేష్,దేవుని రాజు,తదితరులు పాల్గొన్నారు.