మోతే గ్రామంలో ఐమాక్స్ లైట్స్ ప్రారంభం
సూర్య వేల్పూరు: వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ప్రజలకు మెరుగైన వీధి దీపాల సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన నాలుగు ఐమాక్స్ లైట్లను మంగళవారం గ్రామ సర్పంచ్ దొల రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు.గ్రామంలోని కుమ్మరివాడ, బారాయవాడ, ఎస్సీ కాలనీ, గొల్లబండల ప్రాంతాల్లో ఈ లైట్లను ఏర్పాటు చేశారు. వీటిలో మూడు ఐమాక్స్ లైట్లను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి, మరో ఐమాక్స్ లైట్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుంచి ఏర్పాటు చేసినట్లుతెలిపారు.గ్రామంలోని వివిధ కాలనీల్లో రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన వెలుతురు అందించడంతో పాటు, రాకపోకలకు ఇబ్బందులు తగ్గించేందుకు ఈ లైట్లు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రజలు, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు వీధి దీపాలు దోహదపడనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి, వార్డు సభ్యులు రమేష్, ప్రవీణ్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.