బాలికపై అఘాయిత్యం.. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
బంట్వారం, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు వికారాబాద్ డీఎస్పీ అంజయ్య తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంట్వారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన జలీల్ జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలికను మాయమాటలతో నమ్మించి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ అంజయ్య వెల్లడించారు.
రిపోర్టర్:శ్రీనివాస్ గౌడ్, బంటారం, వికారాబాద్ జిల్లా.