BREAKING
సెప్టెంబర్‌లో 11.39 శాతానికి ఎగబాకిన భారత హోల్‌సేల్ ధరల సూచీ ద్రవ్యోల్బణం వ్యడ్డీ రేట్ల పెరుగుదలపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విశ్లేషణ ఐపీఓకు ముందే ఫ్యూజన్ సీఎక్స్ దూకుడు: యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 315 కోట్ల నిధుల సమీకరణ! చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంతో యూరోపియన్ యూనియన్ సన్నాహాలు డిజిటల్ సార్వభౌమత్వమే లక్ష్యం: సావరిన్ క్లౌడ్ మిషన్‌ను బలోపేతం చేసేందుకు టీసీఎస్, మేనేజ్‌ఇంజిన్ వ్యూహాత్మక భాగస్వామ్యం! బ్రిటన్ ఏఐ సేఫ్టీ రీసెర్చ్‌ కోసం 250 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించిన ఎన్విడియా ఢిల్లీ పారిశ్రామిక వాడల ఆధునీకరణే లక్ష్యం: రూ. 170 కోట్లతో రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం! అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనివ్వం అనంతపురం నగరంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం 12 ప్రాంతాల్లో ఒకేసారి పనులకు భూమి పూజ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ కీలక ఫోన్ సంభాషణ: వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం! మహిళల సౌకర్యార్థం పింక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి భూమి పూజ రూపాయిని కాపాడేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందా? కీలక సమీకరణాలను వివరించిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా! పన్ను వసూళ్లలో జోరు: 2026-27 ఆర్థిక సంవత్సర ఆదాయ లక్ష్యాలను కేంద్రం సులభంగా అధిగమించే అవకాశం! భారత్-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు: చైనాను దూరం పెట్టొద్దన్న ఉదయ్ కొటక్.. వ్యూహాత్మక సమతుల్యతపై కీలక విశ్లేషణ! వాటర్ బిల్లులపై 319 మిలియన్ డాలర్ల కోత విధించిన బ్రిటన్ రెగ్యులేటర్ ఏఐ ఆధారిత సైబర్‌ సెక్యూరిటీ సంస్థగా ఏఏఏ టెక్నాలజీస్ రూపాంతరం: 1,000 మంది ఉద్యోగుల నియామకమే లక్ష్యం!

ఆడుతూ పాడుతూ తిరిగే పసిపాప.. అంతలోనే అనంతలోకాలకు

Select Suryaa Now
ఆడుతూ పాడుతూ తిరిగే పసిపాప.. అంతలోనే అనంతలోకాలకు

14 నెలల చిన్నారి మృతితో తీర్థాలలో విషాదఛాయలు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :

ఆ ఇంట్లో చిన్నారి నవ్వులతో సందడి ఉండేది.. బుడిబుడి అడుగులతో తల్లిదండ్రుల కళ్లముందు ఆడుకుంటూ అందరినీ మురిపించేది.. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. అప్పటివరకు ఇంటిల్లిపాదికి సంతోషాన్ని పంచిన ఆ పసిపాప అనారోగ్యానికి గురై కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కేవలం 14 నెలల వయసులోనే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయవిదారక ఘటన ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన బానోత్ సునీల్, అంజలి దంపతుల 14 నెలల కుమార్తె హ్యాపీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. బంగారంలా పెంచుకుంటున్న తమ చిన్నారి ఇక లేదన్న నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కళ్లముందే ఆడుతూ పాడుతూ తిరిగిన బిడ్డ విగతజీవిగా మారడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ తల్లిదండ్రుల ఆవేదనను చూసిన బంధువులు, గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు.

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి హ్యాపీకి జ్వరం రావడంతో రెండు రోజుల క్రితం ఖమ్మంలోని అంకురా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో చిన్నారికి ఫిట్స్‌ రావడంతో పాటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు గుర్తించినట్లు సమాచారం. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స కొనసాగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు మంగళవారం సాయంత్రం చిన్నారి తుదిశ్వాస విడిచింది.

తల్లిదండ్రులకు తీరని శోకం

కన్నబిడ్డకు నయం కావాలని, మళ్లీ తమ ఇంట్లో చిన్నారి నవ్వులు వినిపించాలని ఆశించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. తమ బిడ్డను కాపాడుకోవాలన్న వారి ఆశలు అడియాశలు కావడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. పసిపాప మృతితో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నారి మరణవార్త తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

చిన్న వయసులోనే లోకాన్ని విడిచివెళ్లిన హ్యాపీ మృతితో తీర్థాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల కన్నీటిని ఆపడం ఎవరి వల్లా కాకపోవడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అందరినీ నవ్విస్తూ, ఇంటికి ఆనందాన్ని పంచాల్సిన పసిపాప ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం గ్రామస్తులను కలచివేసింది.