BREAKING
ఐపీఓకు ముందే ఫ్యూజన్ సీఎక్స్ దూకుడు: యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 315 కోట్ల నిధుల సమీకరణ! చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంతో యూరోపియన్ యూనియన్ సన్నాహాలు డిజిటల్ సార్వభౌమత్వమే లక్ష్యం: సావరిన్ క్లౌడ్ మిషన్‌ను బలోపేతం చేసేందుకు టీసీఎస్, మేనేజ్‌ఇంజిన్ వ్యూహాత్మక భాగస్వామ్యం! బ్రిటన్ ఏఐ సేఫ్టీ రీసెర్చ్‌ కోసం 250 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించిన ఎన్విడియా ఢిల్లీ పారిశ్రామిక వాడల ఆధునీకరణే లక్ష్యం: రూ. 170 కోట్లతో రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం! అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనివ్వం అనంతపురం నగరంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం 12 ప్రాంతాల్లో ఒకేసారి పనులకు భూమి పూజ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ కీలక ఫోన్ సంభాషణ: వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం! మహిళల సౌకర్యార్థం పింక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి భూమి పూజ రూపాయిని కాపాడేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందా? కీలక సమీకరణాలను వివరించిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా! పన్ను వసూళ్లలో జోరు: 2026-27 ఆర్థిక సంవత్సర ఆదాయ లక్ష్యాలను కేంద్రం సులభంగా అధిగమించే అవకాశం! భారత్-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు: చైనాను దూరం పెట్టొద్దన్న ఉదయ్ కొటక్.. వ్యూహాత్మక సమతుల్యతపై కీలక విశ్లేషణ! వాటర్ బిల్లులపై 319 మిలియన్ డాలర్ల కోత విధించిన బ్రిటన్ రెగ్యులేటర్ ఏఐ ఆధారిత సైబర్‌ సెక్యూరిటీ సంస్థగా ఏఏఏ టెక్నాలజీస్ రూపాంతరం: 1,000 మంది ఉద్యోగుల నియామకమే లక్ష్యం! గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు: సెప్టెంబర్‌లో 71 శాతం పెరిగి రూ. 4,451 కోట్లకు చేరిన ఇన్‌ఫ్లోలు! భారతీయ రైతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పాటు: జొన్న పరిశోధనలకు ఏఐతో సరికొత్త ఊతం.. గూగుల్ డీప్‌మైండ్ సీవోవో లీలా ఇబ్రహీం వెల్లడి!

నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి

Select Suryaa Now
నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి

 

సూర్య బాల్కొండ: గవర్నర్ కోటాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి కేటాయించి, గౌరవ శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని బాల్కొండ నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు జక్కం అశోక్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించి, న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా జక్కం అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి కల్పించాలనే డిమాండ్‌కు ముదిరాజ్ సామాజిక వర్గ ప్రజలు, యువత మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి తగిన రాజకీయ గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశంపై బాల్కొండ నియోజకవర్గంలోని ముదిరాజ్ యువత, వివిధ ముదిరాజ్ సంఘాల నాయకులతో చర్చించి, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించి, ముదిరాజ్ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు.నీలం మధు ముదిరాజ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు తన వంతు కృషి చేస్తానని జక్కం అశోక్ ముదిరాజ్ పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించేందుకు సంఘటితంగా ముందుకు సాగుతామని తెలిపారు.