మధిర మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (ఎంఈఓ)గా చెరుపల్లి శ్రీహరి నియామకం
మధిర, సూర్య మేజర్ న్యూస్.
మధిర మండల విద్యాశాఖ అధికారిగా చెరుపల్లి శ్రీహరి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన మండలంలోని మాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీహరిని మండల విద్యాశాఖ అధికారిగా నియమిస్తూ వరంగల్ ఆర్. జె. డి. ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన నియామకంపై టీ.ఎస్ యు.టి.ఎఫ్, పి ఆర్ టి యు, టీ పి టి ఎఫ్, టీ.ఎన్ యు ఎస్ మరియు ఎస్ టి ఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు- ఉపాధ్యాయినిలు అభినందనలు తెలిపారు.