BREAKING
తజికిస్థాన్‌లో ఎస్‌సీవో ప్రభుత్వ అధిపతుల సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మున్సిపల్ వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా చిమట లక్ష్మి నామినేషన్ సర్పంచ్ బండ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో టేకులపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా అవర్ణ నామినేషన్ దాఖలు సౌదీ స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు పూల పండుగతో మురిసిన రాజీవ్ గాంధీ నగర్ జనసేన పార్టీలో చేరిన వడ్డీవారి పాలెం మాజీ సర్పంచ్ సర్పంచ్ లావణ్య మోహన్ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో ఘనంగా బతుకమ్మ సంబరాలు కెనడా మిలిటరీ బేస్‌లో ఘోర అగ్నిప్రమాదం...ఏడుగురు మృతి కోలాహలంగా కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు అవకాశమివ్వండి 21వ వార్డును అభివృద్ధి చేస్తా : బర్నేపల్లి రవికుమార్ ఆక్రమిత ప్రాంతంలో అమెరికా అధికారుల పర్యటన రాబోయే తరానికి బతుకమ్మ ప్రాశాస్థ్యం,తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను అందించాలి ---ఎమ్. పి. ఈటల. కౌన్సిలర్ అభ్యర్థిగా పంతానీి నాగమల్లేశ్వరి నామినేషన్ కుష్నర్‌లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక చర్చలు

మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక పురోగతి.. నలుగురు నేపాలీలు అరెస్ట్

Select Suryaa Now
మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక పురోగతి.. నలుగురు నేపాలీలు అరెస్ట్

హైదరాబాద్:నగరంలో సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులకు కీలక విజయం దక్కింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేపాలీ పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నిందితులను తెలంగాణ స్పెషల్ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి.

జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని నివాసంలో గత మే 8వ తేదీన తనూజ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన నిందితులు.. తనూజను హతమార్చి, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులతో పరారయ్యారు. ఘటన అనంతరం నిందితులు నేపాల్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

గత ఆరు నెలలుగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టి, త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.