లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సదాశివపేట ; సదాశివపేట మండలానికి చెందిన 28 మంది, సదాశివపేట పట్టణానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు మొత్తం 50 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అందజేశారు. తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం రూ.13,30,500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడంలో సీఎం రిలీఫ్ ఫండ్ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:మండల, పట్టణ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, చీల మల్లన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం, మైనార్టీ అధ్యక్షుడు కామేల్, సర్పంచులు తొంట కిష్టయ్య, నాగరాజ్, నవీన్ కుమార్, ప్రమోద్, లక్ష్మయ్య, కౌన్సిలర్లు నజీర్, విజయ్, కలీం పటేల్, సంక్షయి గౌడ్ , మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, మానయ్య, కుందేన రాజు, సలావొద్దీన్, సిద్ధన్న, కరుణాకర్, దాసు, రాములు, మాజీ ఎంపీటీసీలు అశోక్, సుధాకర్, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాండునాయక్‌తో పాటు నాయకులు యాదగౌడ్, శివకుమార్, డిదిగే నాగేష్, లతీఫ్, రాజశేఖర్ రెడ్డి, శివ, మానయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.