BREAKING
విగ్రహాలను కూల్చగలరేమో.. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని చెరిపేయలేరు గీతంలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు రోగం వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాలా? పేదవాడు వైద్యం కోసం అప్పులపాలవ్వాలా? ఇంకెన్నాళ్లు నేరేడుచర్ల ప్రజలకు ఈ వైద్య కష్టాలు? నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి బి ఆర్ ఎస్ నేత రాపోలు నవీన్ కుమార్ ధనలక్ష్మి దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలన మంచిర్యాల జిల్లాలో 289 ఉద్యోగాలు ​కొత్తపేటలో భక్తి, సేవల సమ్మేళనం.. ఉచిత వైద్యశిబిరం, అన్నదాన కార్యక్రమం విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు. మండలంలో విద్యుత్ శాఖ అధికారులు మెరుపు దాడులు. 'గరివిడి లక్ష్మి' ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. అక్టోబర్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! గాయత్రి దేవి అలంకారంలో తాళమ్మ మొయిదలో 20 కుటుంబాలు టిడిపిలో చేరిక ఈ-ఆటోల ప్రారంభోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి దేవీ నవరాత్రుల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యంగా ఉండాలని భరోసా మహిళలకు అండగా జెండర్ రిసోర్స్ సెంటర్

కుమురం సూరు జెండా గద్దెకు స్థలం కేటాయించాలి

Select Suryaa Now
కుమురం సూరు జెండా గద్దెకు స్థలం కేటాయించాలి
సూర్య  జైనూర్: జైనూర్ మండల కేంద్రంలో కొమురం సూరు వర్ధంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు జెండా గద్దె నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ కొలాం సేవా సంఘం నాయకులు సోమవారం జైనూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.జైనూర్, సిర్పూర్‌ (యు), లింగాపూర్‌ మూడు మండలాలకు చెందిన కొలాం సేవా సంఘం నాయకులు ఈ వినతిపత్రాన్ని అందజేశారు. దసరా పండుగను పురస్కరించుకొని కొమురం సూరు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్‌ను కోరారు.వినతిపత్రం సమర్పించే ముందు కొలాం సేవా సంఘం నూతన కమిటీ సభ్యులు కొమురం సూరు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మూడు మండలాల అధ్యక్షుడు ఆత్రం బాపూరావు, గౌరవ అధ్యక్షుడు ఆత్రం రాజు, ప్రధాన కార్యదర్శి ఆత్రం భీంరావు, ఉపాధ్యక్షుడు కొడప భీంరావు, సలహాదారు ఆత్రం భీంరావు, కార్యదర్శి కొడప రాజుతో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.