కుంగ్ ఫూ విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు.
కొందుర్గ్ మండల కేంద్రంలోని ఆక్స్ ఫర్డ్ ఉన్నత పాఠశాల ఆవరణలో న్యూ మంక్స్ కుంగ్-పూ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించినట్లు న్యూ మంక్స్ కుంగ్-పూ తెలంగాణ చీఫ్ ఇన్స్ ట్రక్టర్ జిల్లెల రమేష్ తెలిపారు. ఫరూక్ నగర్, జిల్లేడు - చౌదరి గూడెం, కొందుర్గు మండలాలకు చెందిన 48 మంది విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలకు హాజరు కాగా, వీరిలో యెల్లో బెల్ట్ విభాగంలో 22 మంది, ఆరంజ్ బెల్ట్ విభాగంలో 10 మంది, గ్రీన్ బెల్ట్ విభాగంలో 6 మంది, బ్లూ బెల్ట్ విభాగంలో 6 మంది, బ్రౌన్ బెల్ట్ విభాగంలో నలుగురు పరీక్షలలో ఉత్తీర్ణులు అయినట్లు మాస్టర్ జిల్లెల రమేష్ తెలిపారు. అనంతరం అక్స్ ఫర్డ్ పాఠశాల కరెస్పాండెంట్ బి జోసెఫ్ చేతుల మీదుగా సర్టిఫికెట్ లు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మాస్టర్ బాల్ రాజ్, మాస్టర్ కార్తీక్, మాస్టర్ ప్రభు, మాస్టర్ కర్ణాకర్, మాస్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్…..