కౌన్సిలర్ వంశీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సంగారెడ్డి ; పట్టణంలోని కల్వకుంట ఏడవ వార్డులో కౌన్సిలర్ వంశీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటపాటలతో ఆలయ పరిసరాల్లో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు.