BREAKING
సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఎల్ నినోను కాంగ్రెస్ కు అంటగట్టడం హాస్యాస్పదం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు రావులపాలెంలో దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు: కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి! కాన్షీరాం స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం సాధించాలి: నత్తి మైసయ్య మార్కండేయ ఆలయ కమాన్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టు ఆర్‌కేకు జక్కంపూడి రాజా, వేణుగోపాలకృష్ణ పరామర్శ భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు డబ్బాకుపల్లి సర్పంచ్ అభ్యర్థి రేసులో ఆరుద్ర నాగేశ్వరరావు? సర్పంచ్ పదవిపై ఆసక్తి.. గ్రామంలో జోరుగా సాగుతున్న చర్చలు

కడ్తాల్ మండలానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Select Suryaa Now
కడ్తాల్ మండలానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 

కడ్తాల్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కడ్తాల్ మండలం ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మండల బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం సంబరాలు చేసుకున్నారు.

కడ్తాల్ మండల కేంద్రంలో మాజీ రాష్ట్ర యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ కేశని మహేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.

తెలంగాణ ఏర్పాటు అనంతరం పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 2016లో కడ్తాల్ ను మండలంగా ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు, సేవలు అందుబాటులోకి వచ్చాయని నాయకులు పేర్కొన్నారు. కడ్తాల్ ను మండలంగా చేసిన కేసీఆర్ కు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గంపా వెంకటేష్ గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరత్ నాయక్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ లయక్ అలీ, రామకృష్ణ, లక్ష్మణాచారి, రామచంద్రయ్య, మూడ అశోక్, నాగార్జున, మహేష్, వెంకటేష్, పాండు, మహేష్, అంజి, శ్రీకాంత్, సురేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.