BREAKING
స్థానిక ఎన్నికలపై సమాయత్తంగా ఉండాలి సామాజిక సేవల్లో... కూటమి నాయకులు గృహిణి అదృశ్యం సంక్లిష్టమైన ఛాతీ వ్యాధులకు రోబోట్ తో సులభంగా సర్జరీలు *యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డా. రోహన్ రెడ్డి* వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు

జిల్లాలో డ్రగ్స్ వినియోగం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి*

Select Suryaa Now
జిల్లాలో డ్రగ్స్ వినియోగం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి*

 

*జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*

*కలెక్టర్ కార్యాలయంలోని వి.సీ హాలులో  యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా ఎన్ని కేసులు నమోదు
అయ్యాయని ఆరా తీసి డ్రగ్స్ ఏమైనా పట్టుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు
.జిల్లాలో  కంపెనీల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.పెట్టాలన్నారు.యువత మాదక ద్రవ్యాల వాడకుండా కాలేజీ లలో,గ్రామాలలో, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.మత్తు పదార్థాల వినియోగ బాధితుల వల్ల కుటుంబాలకు, సమాజానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు
*జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లడుతూ* ఫ్యాక్టరీ పని చేసే వారి పై నిఘా ఉంచాలని,కాలేజీ లలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.జిల్లాలో అందరూ సమన్వయంతో డ్రగ్స్ నిర్మూలన జిల్లాగా ఉండేందుకు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సజ్  అధికారి తుక్యా నాయక్,జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్ , సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు*