జర్నలిస్టులందరికీ షరతులు లేని హెల్త్ కార్డులు ఇవ్వాలి -టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) డిమాండ్
జర్నలిస్టులందరికీ షరతులు లేని హెల్త్ కార్డులు ఇవ్వాలి
-టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) డిమాండ్
కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్)- అర్హులైన జర్నలిస్టులందరికీ ఉద్యోగులతో సమానంగా షరతులు లేని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా హెల్త్ కార్డులు ఇచ్చి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నపం పంపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సంక్షేమం పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి ఉద్యమం చేపట్టడం శుభపరిణామమన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మట్టికొండ రవి, కాగితపు వెంకటేశ్వరరావు, కృష్ణ గోవింద్, మోటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, చావా పాపారావు, కృష్ణారావు, రమేష్, రమణ, తారక్, అశోక్, ప్రవీణ్, ఈశ్వర్, షబ్బీర్, శ్రీనివాస్, రాందాస్, జక్కంపూడి నరేష్, సత్య, శనగ లక్ష్మణ్, రహీం, స్వామి, గుంటుపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.