BREAKING
స్థానిక ఎన్నికలపై సమాయత్తంగా ఉండాలి సామాజిక సేవల్లో... కూటమి నాయకులు గృహిణి అదృశ్యం సంక్లిష్టమైన ఛాతీ వ్యాధులకు రోబోట్ తో సులభంగా సర్జరీలు *యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డా. రోహన్ రెడ్డి* వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు

జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ కేటగిరి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రామారావు

Select Suryaa Now
జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ కేటగిరి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రామారావు

--జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఏం) కింద వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ----జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రామారావు
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):
ఖమ్మం జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి  కార్యాలయ పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఏం) విభాగంలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 99 పోస్టులను కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్  అధ్యక్షతన ఏర్పడిన జిల్లా ఎంపిక కమిటీ  ద్వారా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్యమైన సమాచారం అండ్ మార్గదర్శకాలు:
  పోస్టుల సంఖ్య: 99
  నియామక విధానం: కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన
  దరఖాస్తు స్వీకరణ తేదీలు: 08-10-2026 నుండి 13-10-2026 వరకు (కార్యాలయ పనివేళల్లో 5.00P.M.)
  దరఖాస్తు చేసుకునే విధానం: అర్హులైన అభ్యర్థులు ఖమ్మం జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు సంబంధిత విద్యార్హతలు, కుల, స్థానికత మరియు ఇతర ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతచేయాలి.
   దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:
  జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం,
  రూమ్ నం. ఎఫ్.1కలెక్టరేట్ కాంప్లెక్స్ ,
  వి. వెంకటాయపాలెం, ఖమ్మం.
పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక నిబంధనలు తదితర పూర్తి వివరాల కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://khammam.telangana.gov.in/ ను సందర్శించాల్సిందిగా కోరడమైనది. నిర్ణీత గడువు (13-10-2026, 5.00 పి.ఏం) ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించబోమని స్పష్టం చేశారు.