BREAKING
అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఘనవిజయం

Select Suryaa Now
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఘనవిజయం

--- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికల్లో వామపక్ష, సామాజిక కూటమికి ఘన విజయం.

--- మతోన్మాద కూటమిని మట్టి కల్పించిన ఎస్ఎఫ్ఐ కూటమి

--- విద్యార్థి లోకానికి  అభినందనలు

--ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్


ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు 2026–27లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలోని వామపక్ష, సామాజిక శక్తుల కూటమి ఘన విజయం సాధించింది. ఎస్ఎఫ్ఐ, ఏ ఎస్ ఏ, ఏఐఎస్ఎ, డి ఎస్ యు, టి ఎస్ ఎఫ్ కూటమి అభ్యర్థులు పలు కీలక పదవుల్లో విజయం సాధించారు.
ఈ సందర్భంగా ఖమ్మం నగర కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. పీజీ కళాశాల వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం టపాసులు కాల్చి విద్యార్థులతో విజయోత్సవం ఎస్ఎఫ్ఐ నాయకులు పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్ మాట్లాడుతూ ,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికలలో
ప్రధానంగా ఏ.బి.వి.పి,--ఎస్.ఎఫ్. ఐ  కూటముల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎస్.ఎఫ్. ఐ ఆధ్వర్యంలోని కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. 
అధ్యక్ష పదవికి ఎస్.ఎఫ్. ఐ తరఫున పోటీ చేసిన దిల్షాదా 451 ఓట్ల మెజారిటీతో ఏ .బి.వి.పి.అభ్యర్థి పి. నరేష్‌పై విజయం సాధించారు. దిల్షాదాకు 2,178 ఓట్లు, నరేష్‌కు 1,727 ఓట్లు వచ్చాయి.
ఉపాధ్యక్ష పదవికి ఎస్.ఎఫ్. ఐ కూటమి అభ్యర్థి కొర్రా నితిన్ చాహాన్ 287 ఓట్ల మెజారిటీతో  బర్షరాణి బెహరాపై విజయం సాధించారు. 
ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన ప్రతీక్ 311 ఓట్ల మెజారిటీతో  కూటమి అభ్యర్థి వినీష్ చౌదరిపై గెలుపొందారు.ప్రధాన ప్యానల్‌తో పాటు 13 స్కూళ్ల పరిధిలోని 59 స్కూల్ కౌన్సిలర్, స్కూల్ బోర్డు మెంబర్ స్థానాల్లో 32 స్థానాలను ఎస్.ఎఫ్. ఐ కూటమి సాధించిందని తెలిపారు.
గత ఏడాది కాలంలో ఏ .బి.వి.పి.విద్యార్థి సంఘం అధికారంలో ఉన్న సమయంలో క్యాంపస్‌లో ప్రజాస్వామ్య వాతావరణం దెబ్బతిన్నదని, విద్యార్థుల సమస్యలను ప్రశ్నించిన వారిపై దాడులు జరిగాయని, కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం తగిన స్థాయిలో పని జరగలేదని విద్యార్థులు తమ ఎన్నికల తీర్పు ద్వారా స్పష్టం చేశారని ఎస్.ఎఫ్. ఐ.జిల్లా కమిటీ పేర్కొంది. 
అలాగే విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలపై నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని తెలిపింది.
ఈ ఎన్నికల ఫలితాల ద్వారా విద్యార్థుల సమస్యలు, హక్కులు, క్యాంపస్ ప్రజాస్వామ్యం వంటి అంశాలపై పోరాడుతున్న విద్యార్థుల పక్షాన నిలబడటానికి విద్యార్థి లోకం తమ మద్దతును తెలియజేసిందని ఎస్.ఎఫ్. ఐ జిల్లా కమిటీ పేర్కొంది.ఈ విజయాన్ని అందించిన హెచ్.సి.యు. విద్యార్థి లోకానికి ఎస్.ఎఫ్. ఐ జిల్లా కమిటీ జేజేలు పలికింది. విద్యార్థులు తమపై ఉంచిన బాధ్యతను గుర్తించి క్యాంపస్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం, మెరుగైన మౌలిక సదుపాయాల కోసం కృషి చేయడం వంటి అంశాలపై ఎస్.ఎఫ్. ఐ కూటమి పనిచేస్తుందని తెలిపింది.
ఎన్నికల్లో విజయం సాధించిన ఎస్.ఎఫ్. ఐ కూటమి అభ్యర్థులకు  ఖమ్మం జిల్లా కమిటీ అభినందనలు తెలిపింది. ఈ విజయోత్సవ సంబరాలలో జిల్లా అధ్యక్షులు వంకాయల రాజు ఖమ్మం డివిజన్ అధ్యక్షులు త్రినాథ్ ఎస్ ఆర్ ఎన్ బి జి ఎన్ ఆర్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు సుశాంత్, శ్యామ్ నాయకులు వినీత, మనీషా, పూజిత నవ్య శివాని, లోకేష్,భాను, వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు