ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ..
నంగునూరు:- మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.గ్రామల్లో వివిధ కాలనీలో, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున సాంప్రదాయ బతుకమ్మలను పేర్చి భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు గౌరమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు వార్డ్ సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది తో
మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ ఆడుకునేందుకు ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత వైభవంగా విజయవంతం చేశారని పలువురు అభినందించారు.