BREAKING
అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు

గర్భిణీలు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి

Select Suryaa Now
గర్భిణీలు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి

ఇల్లందు సూర్యా ప్రతినిధి: 

గర్భిణీలు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని కౌన్సిలర్ దండుసారయ్య అన్నారు. బుధవారం మున్సిపాలిటీలో 13వ వార్డులోని హమాలి బస్తీలో అంగన్వాడి సెంటర్ లో పోషణ మాస మహోత్సవాలను ఐసిడిఎస్ అధికారి అరుణతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దండు సారయ్య మాట్లాడుతూ పోషకాహారం, ఆరోగ్యం, తల్లి బిడ్డల సంరక్షణ పై పోషకాహార మాస ఉత్సవాలలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పిల్లల ఆరోగ్య కరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో తోడ్పాటును అందిస్తుందన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పోషకాహార లోపం నివారించేందుకు ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలన్నారు. అనంతరం చిన్నారులకు మహిళలకు పోషకాహారం ప్రాధాన్యత వివరాలను తెలియజేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రోహిణి, అంగన్వాడి టీచర్లు, గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్