గాంధీ జయంతి వేడుకలకు హాజరైన చైర్ పర్సన్
గాంధీ జయంతి వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్
జనగామ జిల్లా. సూర్య ప్రతినిధి అక్టోబర్ 02 మేజర్ న్యూస్ ):-
జనగామ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గాంధీ చౌరస్తా, జిల్లా గ్రంధాలయ శాఖ ఆఫీసులో, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహం, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన జనగామ కోసం ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.