BREAKING
మీ రాక మాకు పండుగ జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి గడ్డమణుగు రవికుమార్ షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ గా వెంకటేశ్వర్లు... కేశంపేట సిఐ గా శ్రీనివాస్.. దుర్గమ్మ కరుణా, కటాక్షం ప్రజలందరిపై ఉండాలి ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయాలి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం జర్నలిస్ట్ ఆర్కే ను పరామర్శించిన రాజా, వేణు సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

గాయకుడు చామనపల్లి లక్ష్మీనారాయణకు ఘన సన్మానం

Select Suryaa Now
గాయకుడు చామనపల్లి లక్ష్మీనారాయణకు ఘన సన్మానం

గాయకుడు చామనపల్లి లక్ష్మీనారాయణకు ఘన సన్మానం 

 సూర్య బోయినపల్లి:తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్ వేదికగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి జానపద సాంస్కృతిక జాతరలో బోయినపల్లికి చెందిన ప్రముఖ గాయకుడు చామనపల్లి లక్ష్మీనారాయణ విశేష ప్రతిభ కనబరిచి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కళాకారులు ఘనంగా సత్కరించారు.లక్ష్మీనారాయణ ప్రతిభను అభినందిస్తూ జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం ఉపాధ్యక్షుడు కనపర్తి హనుమండ్లు, రాష్ట్ర కన్వీనర్ ఎల్ల పోశెట్టి, ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు శాలువాతో సన్మానించారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర వేదికపై ప్రతిభ చూపి మండలానికి గుర్తింపు తేవడం గర్వకారణమని వక్తలు పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం అధ్యక్షుడు వారాల దేవయ్య, మండల ప్రధాన కార్యదర్శి బిల్ల వెంకటనర్సయ్య, గాయకులు గడిల రవి, దూస కిషోర్, తబలా కళాకారులు బిల్ల శంకర్, శ్రీపతి చంద్రమౌళి, మెరుపుల గంగాధర్, పెరుమాండ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.