BREAKING
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

ఎంసీ పల్లిలో 20 వేల మొక్కల మెగా ప్లాంటేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

Select Suryaa Now
ఎంసీ పల్లిలో 20 వేల మొక్కల మెగా ప్లాంటేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

శామీర్‌పేట, మేజర్ న్యూస్: భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఎస్‌బీఐ సీఎస్‌ఆర్ నిధులతో ఐజీఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన 20 వేల మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని శనివారం మున్సిపల్ చైర్మన్ జాం రవితో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ… పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, భావితరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగి పెద్దయ్యే వరకు సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20 వేల మొక్కలు నాటే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం పచ్చదనం పెంపొందించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మోర్సు బాయి శశిరేఖ, కౌన్సిలర్లు ర్యాకల నీరజ్ గౌడ్, ఆది అజయ్ కుమార్, కొల్లాస్ రాజు, గిరిపల్లి రమేష్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జి. మల్లేష్ గౌడ్, ఐజీఎఫ్ సిబ్బంది శిరీష, రవికుమార్, మెడికల్ ఆఫీసర్ స్వర్ణలత, నాయకులు రవీందర్ రెడ్డి, యాదగిరి సంతోష్ రెడ్డి, నరసింహులు, నాగరాజు, మురళి, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.