BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

లక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన జగదాంబ మాత

Select Suryaa Now
లక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన జగదాంబ మాత

ఘట్‌కేసర్‌ రూరల్, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పోచారం డివిజన్‌ అన్నోజిగూడలోని శ్రీ జగదాంబ మాత, శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, గణపతి హోమం నిర్వహించి లోకకల్యాణం, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం నానవత్‌ తారాసింగ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన తారాసింగ్‌ నాయక్‌, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో నానవత్‌ రాంసింగ్‌ నాయక్‌, శేఖర్‌ నాయక్‌, రాజు నాయక్‌, జితేందర్‌ నాయక్‌, భిక్కు నాయక్‌, డాక్టర్‌ దారావత్‌ కిరణ్‌కుమార్‌, విశ్లావత్‌ జగన్‌ నాయక్‌, అంగోత్‌ లక్ష్మణ్‌ నాయక్‌, నానవత్‌ రమేష్‌ నాయక్‌, విశ్లావత్‌ రాంసింగ్‌ నాయక్‌, ట్రస్టు బోర్డు సభ్యులతో పాటు బంజారా యూత్‌ సభ్యులు విష్ణు, అభిలాష్‌, చరణ్‌, ఆదిత్య, రామ్‌, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.