BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

కారు ఢీకొని యువకుడు దుర్మరణం.

Select Suryaa Now
కారు ఢీకొని యువకుడు దుర్మరణం.


కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారిలో పోడుగుపాడు గ్రామ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ జగన్నాధపురం పంచాయతీ, బిర్లంగి గ్రామానికి చెందిన ఆవల రాంబాబు (25) దుర్మరణం చెందాడు. రాంబాబు తన స్వగ్రామం బిర్లంగి గ్రామం నుంచి వచ్చి పొడుగుపాడు వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా టెక్కలి వైపు నుండి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాంబాబును ఢీకొన్న కారు అదుపుతప్పి డివైడర్ పై త్రుల్లి పడింది. సంఘటనలో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెలు కాపరిగా పనిచేస్తున్న రాంబాబుకు తండ్రి భూషణరావు, తల్లి పారమ్మ, వివాహిత అయిన అక్క హారతి ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై వి. సత్యనారాయణ తెలిపారు. అవివాహతుడై, వివాద రహితుడై  అందరితో సరదాగా వ్యవహరించే రాంబాబు మృతి బిర్లంగి గ్రామాన్ని శోకసముద్రంలో ముంచేసింది. ఎంతో ఉద్ధరిస్తాడు అన్న కుమారుడు కళ్ళముందే కదలాడుతున్నట్లు ఉంటూ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదన అరణ్య రోదన తీర్చలేనిది.