BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు.

Select Suryaa Now
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు.

 

నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండా అడ్డగింత - ఉద్రిక్తత..

పలాస,పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ చైర్మన్ అభ్యర్థితో పాటు 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కేంద్రానికి వెళ్తున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు.శనివారం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు,ఎమ్మెల్సీ కుంభ రవిబాబు,వైసీపీ ఎన్నికల పరిశీలకులు ఎన్ని ధనుంజయ్ నామినేషన్ కేంద్రానికి వెళ్తుండగా కాశీబుగ్గ పోలీసులు అడ్డుకున్నారు.మొదట కాశీబుగ్గ పెట్రోల్ బంక్ వద్ద,తర్వాత పలాస జీడిపిక్క బొమ్మ వద్ద పోలీసులు వారిని నిలువరించారు.శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో వైసీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.ప్రశాంతంగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది..ప్రజాస్వామ్యంలో సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీసులు తననే టార్గెట్ చేసి ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. చివరకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మాజీ మంత్రి తన నాయకులతో కలిసి వెనుదిరిగారు.