BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన

Select Suryaa Now
కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన

 

మెలియాపుట్టి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతోపాటు, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని డిప్యూటీ ఎంపీడీవో వి. అప్పయ్య సూచించారు. శనివారం మెలియాపుట్టి మండలం కేరాసింగి గ్రామపంచాయతీలో వర్మీ కంపోస్ట్ తయారీ, ఇంటింటికీ చెత్త సేకరణ, తడి, పొడి చెత్త వేరు చేసే విధానాలపై పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో మాట్లాడుతూ.. తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా చెత్త నిర్వహణ సులభతరమవుతుందని తెలిపారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువైన వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చని వివరించారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే సమయంలో ప్రజలకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు.పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, నిర్దేశించిన పద్ధతిలో సేకరించి నిర్వహించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.