BREAKING
మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా షూటింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్! అభివృద్ధిని చూసి ఓటు వేయండి రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి: కాకా సినిమాపై భారీ అంచనాలు! కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై తీరి వీధి సాయి ప్రసాద్ ప్రకటన శ్రీరాంపూర్‌ ఏరియా వ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు పంటలు ఎండుతున్నా పట్టించుకునేదెవరు? మంత్రి జూపల్లిపై ఎల్లేని సుధాకర్ రావు విమర్శలు ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలా సత్తిబాబు* ప్రజా సమస్యలపై కార్పొరేటర్‌ తక్షణ స్పందన - గుంతలకు తాత్కాలిక మరమ్మతులు ఆయుధాల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ స్నేహ మెహ్రా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుదాం.... ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుదాం.... ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయమే లక్ష్యం*

*నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలి*

*రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతోందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌ వీర్లపల్లి శంకర్‌ స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు – రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్‌ రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని బృందావన్‌ గార్డెన్స్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌, శివసేన రెడ్డి, సరితా తిరుపతయ్య, మైనారిటీ చైర్మన్‌ ఉబేదుల్లా కొత్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ చరిత్రలోనే ఇంత ముందుగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం వెనుక కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహాన్ని నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు వస్తోందని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జవ్వాజి రాఘవేంధర్ గౌడ్: మేజర్ న్యూస్, షాద్ నగర్.