BREAKING
మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోటి రూపాయలు శ్రీదేవి కంటే ముందే ఆ అమ్మాయిని 10 ఏళ్లు ప్రేమించా: తొలి ప్రేమపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! దసరా సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారణలో దర్శనమిచ్చిన నల్ల పోచమ్మ అమ్మవారు ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు బాలీవుడ్‌లో హింసాత్మక చిత్రాలదే రాజ్యమనేది ఒక భ్రమ మాత్రమే: నటుడు గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు! కదిరిలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు బిస్కెట్ బాబా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత రాజమహేంద్రవరం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి విమానాశ్రయంలో ఘన స్వాగతం.. కపిలేశ్వరపురంలో హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం వచ్చే నెలలో కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం వైసీపీ నాయకుడు గొల్ల బసవరాజుకు ఉమామహేశ్వర నాయుడు నివాళులు దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం సిజిపి నిరసనలపై మండిపడ్డ కంగనా రనౌత్: దేశాన్ని అస్థిరపరిచేందుకు దేశద్రోహ శక్తుల కుట్ర అంటూ ఆగ్రహం! దేవుని కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ఎలికట్ట అంభభవాని ఆలయంలో ఎమ్మెల్సీ పూజలు....

Select Suryaa Now
ఎలికట్ట అంభభవాని ఆలయంలో ఎమ్మెల్సీ పూజలు....

 

షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ శ్రీ అంబా భవానీ మాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ దంపతులకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

 శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో కొలువై ఉన్న భవానీ మాతకు వారు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన ఎల్లికట్ట భవానీ మాత క్షేత్రాన్ని దేవి నవరాత్రుల వేళ దర్శించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆ జగన్మాత కరుణాకటాక్షాలతో ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి పోటెత్తుతున్న భక్తులకు కమిటీ సభ్యులు కల్పిస్తున్న వసతులు, ఏర్పాట్లను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లికట్ట సర్పంచ్ వాకిటి నవకిరణ్ నర్సింహ, మాజీ సర్పంచ్ సాయి యాదవ్, పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, పలమకుల చెన్నయ్య, మాజీ సర్పంచ్ నాగర్ కుంట ఉమా ప్రవీణ్ రెడ్డి, అప్పరెడ్డి గూడ మాజీ సర్పంచ్ జెకే నర్సింహా, వెల్జర్ల మాజీ ఎంపిటిసి అశోక్ రెడ్డి, ఆలయ చైర్మన్ చంద్రయ్య, మాజీ చైర్మన్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రాఘవేందర్ గౌడ్: మేజర్ న్యూస్, షాద్ నగర్