దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
కొందుర్గ్ మండలం పర్వతాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గామాత అమ్మవారిని బుధవారం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అంతకు ముందు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని, బీసీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్.