డైట్ మైదానంలో దసరా వేడుకలకు శ్రీకారం
• భూమిపూజ చేసిన కంది మౌనా శ్రీనివాస రెడ్డి
సూర్య, ఆదిలాబాద్ : పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో బతుకమ్మ, దసరా వేడుకల నిర్వహణకు ఆదివారం భూమిపూజ చేశారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సమితి సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి రోజున రావణ దహనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 14 ఏళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సనాతన హిందూ ఉత్సవ సమితి సేవలను అభినందించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ సమాజ హితం కోసం మరిన్ని ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ప్రజలంతా బతుకమ్మ, దసరా పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్‌రావు, బండారి సతీష్, దర్శన అశోక్, డేరా కృష్ణారెడ్డి, నర్సింలు, వేద పండితులు సంతోష్ శర్మ, సమితి అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ క్రాంతి, డాక్టర్ రజిత, గౌరవ అధ్యక్షుడు కందుల రవీందర్, ప్రధాన కార్యదర్శి రేణికుంట రవీందర్, కోశాధికారి సంతోష్ అగర్వాల్, కార్యనిర్వాహక అధ్యక్షుడు దశరథ్, ఉపాధ్యక్షులు సమనపల్లి నర్సింలు, సురేష్ పౌడవాల్, మహిపాల్, సుభాష్ ఉరడే, తిరుపతిరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.