BREAKING
ప్రపంచవ్యాప్తంగా 60 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డ్! ఓవర్‌లోడ్‌తో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి.. అధిక సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయండి పిల్లలను చెరువులు, కాలువల వద్దకు వెళ్ళనివ్వద్దు - MRO విజ్ఞప్తి త్వరగా ప్రజావాణి దరఖాస్తులను  పరిష్కరించాలి - కలెక్టర్ రాజర్షి షా రోడ్డు పక్కన ఉన్న చెట్లను, పొదలను తొలగించండి. టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల అద్భుత సినీ ప్రస్థానం.. నటుడిగా, నాయకుడిగా ప్రత్యేక ప్రయాణం! రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే ప్రజా సమస్యలు పరిష్కార వేదికకు ప్రభుత్వం ప్రాధాన్యం ఏపీ స్థానిక ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయింపు 'గోల్డ్ స్పాట్' నుంచి మనసు దోచేలా 'పరిచయమే' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మెలోడీ! మోకిలా పిఎసిఎస్ చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం -వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ -ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.40 కోట్లు మంజూరు -పాల్గొన్నత్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పులి శాంతిని పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే కదిరి ఏజెంట్ లేకుండానే హాలీవుడ్‌లో ఆఫర్.. విద్యుత్ జమ్వాల్ సంచలన విషయాలు! దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్

చిట్యాల పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం.

Select Suryaa Now
చిట్యాల పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం.

.నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్…చిట్యాల పోలీస్ స్టేషన్‌ను యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం సందర్శించి, పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న విధులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐజీ వెంట ఉన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు, బాలల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఐజీ షాహనవాజ్ ఖాసిం గారు  మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సావధానంగా విని చట్టప్రకారం సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి, బాధితులకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించాలని ఆదేశించారు.చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారితో పాటు ఇతర  రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఐజీ గారు సూచించారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి, సంబంధిత శాఖల సమన్వయంతో నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనదారులకు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో  చట్టం కింద నమోదయ్యే కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐజీ తెలిపారు. బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే చట్టప్రకారం స్పందించి, బాధిత బాలబాలికలకు అవసరమైన రక్షణ, భరోసా కల్పించాలని సూచించారు. బాధితుల గోప్యతను కాపాడుతూ, నిబంధనల ప్రకారం సున్నితంగా విచారణ చేపట్టాలని, సంబంధిత కేసుల్లో శాస్త్రీయ ఆధారాలు సేకరించి నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించారు. బాలలపై నేరాలు జరగకుండా పాఠశాలలు, క్టకళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా చైతన్యం కల్పించాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, ఇళ్ల దొంగతనాలు, వాహనాల చోరీలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐజీ సూచించారు.
అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు సీసీ కెమెరాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, నేరస్తుల కదలికలను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, పునరావృత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.  సైబర్ నేరాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసేలా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తూ, దర్యాప్తులను వేగవంతం చేయాలని, నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించాలని ఐజీ ఆదేశించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ శాఖ తరఫున రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణ, మహిళలు, 
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఐజీ  షాహనవాజ్ ఖాసిం. సూచించారు. ఈ తనిఖీలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు  నల్లగొండ డిఎస్పీ కొలను శివరాం రెడ్డి చిట్యాల సీఐ సురేష్, ఎస్.ఐ వెంకట్ రెడ్డి పోలీస్  సిబ్బంది పాల్గొన్నారు.