చింటూ కుటుంబానికి కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ పరామర్శ
శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. రూ.5 వేల ఆర్థిక సాయం
మేడ్చల్, మేజర్ న్యూస్,( సెప్టెంబర్ 24):
యెల్లంపేట్ మున్సిపాలిటీ 24వ వార్డుకు చెందిన వడ్డే కృష్ణ, అరుణ దంపతుల కుమారుడు చింటూకు ఇటీవల శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. చింటూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా చింటూ కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. చింటూ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్చన శ్రీనివాస్ ఆకాంక్షించారు. కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.రిపోర్టర్ తలారి శివకుమార్.