చిద్రుప్ప గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కంది మేజర్ న్యూస్ ; చిద్రుప్ప గ్రామంలో ఆదివారం బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోడూరి శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్తులంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.