భూ భారతి భూ రి సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
భూభారతి భూ రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి
సర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి
కందుకూరు మండలం నేదునూరు గ్రామపంచాయతీ పరిధిలోని అక్బర్ జా రెవెన్యూ పరిధిలో చేపడుతున్న భూభారతి భూ రీసర్వే కార్యక్రమాన్ని ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెరుగుడ, అక్బర్ జా, నేదునూరు, బాచుపల్లి గ్రామాల సరిహద్దులను పరిశీలించి, ఆయా ప్రాంతాల్లోని మొత్తం భూ విస్తీర్ణం, అసైన్డ్ భూములు, హౌసింగ్ ల్యాండ్స్, పాఠశాల భూములు, పట్టా భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భూ రీసర్వే ప్రక్రియను ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. భూములకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నల్లి శ్రీధర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ గోపాల్, డీఐ రమాకాంత్ రెడ్డి, ఆర్‌ఐ శ్రీకాంత్, మండల సర్వేయర్ సాయికాంత్, ఐకేపీ శ్రీనివాస్, లైసెన్సుడ్ సర్వేయర్ పాశం శ్రీనివాస్, జీపీఓ నాగరాజుతో పాటు రైతులు గంగుల చంద్రారెడ్డి, తలారి యాదయ్య, నల్లి అశోక్, గడ్డమీది పెంటమ్మ, రంగని నరసింహ, ముత్తుకూరు యాదయ్య, బ్యాగరి సుజాత, బోయ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్ : మేజర్ న్యూస్, కందుకూరు.