భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా మాడుగుల రాజ్‌కుమార్.. ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ
భీమదేవరపల్లి, అక్టోబర్ 09(మేజర్ న్యూస్ సూర్య):
భీమదేవరపల్లి మండల ప్రెస్ క్లబ్ (రి. నెం. 629/2022) నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని కొత్త కొండలో నిర్వహించిన సమావేశంలో మండలానికి చెందిన 20 మంది విలేకరులతో సీనియర్ విలేకరి, గౌరవ అధ్యక్షుడు మాడుగుల సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా మాడుగుల రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా మాడుగుల రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా గౌడ చంద్రబాబు, కోశాధికారిగా ఉడుత శ్రీనాథ్, కార్యదర్శిగా కనకం వెంకటేశ్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్ల హరికుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు నూతన విలేకరులకు సభ్యత్వ నమోదులో సహకరిస్తానని తెలిపారు. మండలంలోని 20 మంది విలేకరులతో ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటవడం జర్నలిజం రంగానికి కొత్త ఊపునిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మేకల శ్యామ్, ఆళ్ల కొండ వెంకటేశ్వర్లు, కడారి బాబు, నాగిల్ల రజినీకాంత్, కనగండ్ల అఖిల్, కండె సంజీవ్, రాధారపు ఉదయ్, దాసరి గోపికృష్ణ, బుగ్గ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.