*భారతీయ జనతా పార్టీ దళితమోర్చా కోహెడ మండల కమిటీ కార్యవర్గం నియామకం* *బిజెపి దళితమోర్చా మండల అధ్యక్షుడుగా మాజీ సర్పంచ్ పొన్నాల శంకర్, ఉపాధ్యక్షులుగా మాజీ ఉపసర్పంచ్ మంద మధుకర్*
కోహెడ;బిజెపి దళితమోర్చా మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ పొన్నాల శంకర్ బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం, బిజెపి మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ ఆదేశానుసారంగా ఈరోజున నూతన కార్యవర్గాన్ని నియమించి ప్రకటించడం జరిగింది. కేంద్రమంత్రి బండి సంజయన్న సారథ్యంలో కోహెడ మండలంలోని షెడ్యూల్ తెగలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి బిజెపి దళితమోర్చా మండల కమిటీ నూతన కార్యవర్గం పనిచేస్తుందని దళితమోర్చా మండల అధ్యక్షుడు తెలిపారు. ఈ నూతన కమిటీ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు.