BREAKING
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌దే: హరీశ్‌రావు

Select Suryaa Now
బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌దే: హరీశ్‌రావు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. శనివారం నాగారం డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కౌకుంట్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ….పూలను బతుకమ్మగా పేర్చి ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం తెలంగాణ ప్రజల సొంతమని అన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతుందని తెలిపారు. పూలతో ప్రకృతిని పూజించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని వివరించారు.నాగారం డివిజన్‌లోని వివిధ కాలనీల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. మహిళల కోలాహలం, బతుకమ్మ పాటలతో వేడుకల ప్రాంగణం మార్మోగింది. గాయకుడు, రచయిత దేశపతి శ్రీనివాస్‌ ఆలపించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, గాయకుడు, రచయిత దేశపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు హరీశ్‌రావు రాంపల్లిలోని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయ విశిష్టతను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.