BREAKING
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు

బాసర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
బాసర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ ప్రతినిధి : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.మంగళవారం బాసరలో పర్యటించిన కలెక్టర్, ముందుగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను జాగ్రత్తగా తొలగించాలని సూచించారు. ఆలయ నిర్మాణ పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి నది తీరంలోని పుష్కర ఘాట్లను పరిశీలించి, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కరాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.ఈ పర్యటనలో ఆర్‌ అండ్‌ బీ, నీటిపారుదల శాఖల ఈఈలు సుభాష్, అనిల్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.