BREAKING
బీజేవైఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కొమ్మిడి విక్రాంత్ రెడ్డి *చింతల్‌గట్టులో సరస్వతీ దేవి దివ్యదర్శనం!* *శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విశేష అలంకరణ.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు* పేదల కళ్లలో సంతోషం చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డొంకెని శంకర్ గౌడ్ బండ మాదారం లో యథేచ్ఛగా అక్రమ మట్టి దందా…! మల్లాపూర్ సర్వే నెం. 84/1ను నిషేధిత జాబితా నుంచి తొలగించండి: తహసీల్దార్‌కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి ఘట్‌కేసర్‌లో వివాహిత అదృశ్యం మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నాసిరుల్లా అన్నారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అందరి బాధ్యత -జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటపాటలతో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు -ముఖ్యఅతిథిగా పాల్గొన్న -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు: పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని చాటిన ఉద్యోగులు నిత్య అన్నదాన పథకానికి రూ 4 లక్షలు విరాళం శరన్నవరాత్రుల్లో సరస్వతీ దేవిగా అమ్మవార్ల దర్శనం.. యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడుల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్ చిత్రా మిశ్రా పూడివాడలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు 28న ఆత్రేయపురంలో 108 కల పూజ

అష్టోత్తర శత సుహాసిని పూజ

Select Suryaa Now
అష్టోత్తర శత సుహాసిని పూజ

*పూజా కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్*

 

సత్తుపల్లి మేజర్ సూర్య న్యూస్:
(కిరణ్ కుమార్ ఆరిక)

సత్తుపల్లి మండలం తాళ్లమడ పెద్ద వంతెన వద్దనున్న శ్రీ రాజశ్యామల యాగశాలలో మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం అష్టోత్తర శత సువాసినీ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాజశ్యామల యాగం, నవదుర్గా సహిత వనదుర్గా మహాయాగంలో భాగంగా నిర్వహించిన ఈ విశేష పూజా కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డా. మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యాగశాలలో కొలువుదీరిన అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాగ నిర్వాహకులు బ్రహ్మశ్రీ పెరాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తిభావాన్ని వెల్లివిరిసేలా సాగింది.

రాజశ్యామల యాగం, నవదుర్గా సహిత వనదుర్గా మహాయాగంలో భాగంగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు.