BREAKING
సినిమా పరిశ్రమలో వర్చువల్ ప్రింట్ ఫీ (VPF) వివాదం.. కాంపిటీషన్ కమిషన్ కీలక ఆదేశాలు ప్రభాస్ అభిమానులకు నిరాశ: డిసెంబర్ 3కి వాయిదా పడిన 'ఫౌజీ' సినిమా విడుదల! టాలీవుడ్‌లో కొత్త సంచలనం: దర్శకుడిగా మారుతున్న 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ! *వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మిర్యాలగూడ, మేజర్ న్యూస్: మిర్యాలగూడనియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఇసుకబావి గూడెంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య - సునీత దంపతుల ఆధ్వర్యంలో తాడిగడప, ఉయ్యూరులో వైసీపీ గెలిస్తే రాజీనామా చేస్తా: బోడే ప్రసాద్ నేడు వైకాపా నీటి పోరు..! శభాష్ జీవీఎంసీ! అక్రమ ‘యమలోకం’ పీటలు కదిలించిన అధికారులు అక్టోబర్ 20 నుంచి అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రాత్మక FTA ఒప్పందం ఆసియా క్రీడల్లో బోణీ కొట్టిన భారత మహిళల కబడ్డీ జట్టు ద్రవ్య లభ్యత నిర్వహణలో భాగంగా OMO ద్వారా రూ. 25,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించిన RBI ఆయుర్వేద దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా 9,700కు పైగా కార్యక్రమాలు సోవా-రిగ్పా ఫార్మకోపియా అభివృద్ధికి శ్రీకారం పేద దేశాల కోసం రుణ చట్రంలో మార్పులు చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు అంతర్-రాష్ట్ర మండలి ఉత్తర్వు 1990కి సవరణ

*వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మిర్యాలగూడ, మేజర్ న్యూస్: మిర్యాలగూడనియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఇసుకబావి గూడెంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య - సునీత దంపతుల ఆధ్వర్యంలో

Select Suryaa Now
*వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ  మిర్యాలగూడ, మేజర్ న్యూస్:            మిర్యాలగూడనియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఇసుకబావి గూడెంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య - సునీత దంపతుల ఆధ్వర్యంలో

*వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ

మిర్యాలగూడ, మేజర్ న్యూస్:            మిర్యాలగూడనియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఇసుకబావి గూడెంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య - సునీత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఎంసి కోటిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్నదానం మన సంస్కృతి, సంప్రదాయాల్లో అత్యున్నతమైన సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో పండుగలను నిర్వహించడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్ఫూర్తిదాయకమన్నారు. అదేవిధంగా అనన్య వెంచర్ నిర్వాహకులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, జెర్రిపోతుల రాములు గౌడ్, తంగెళ్ల సీతారాం రెడ్డి, నకిరేకంటి రాబర్ట్, రాయరపు వెంకన్న, ఎర్రమళ్ల దినేష్, చిట్టిపోలు వెంకటేశ్వర్లు, నర్రా ముకేష్ చౌదరి, గుడిగుంట్ల గణేష్, కందగట్ల అశోక్, శ్రావణ్, ఎండి అలీం, గుండా రాంబాబు, గందే రాములు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.