చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
విజయవాడ, మేజర్ న్యూస్ : ఆటోనగర్‌లో వినాయక నిమజ్జనోత్సవం నయనానందకరంగా, ఆధ్యాత్మిక శోభతో వైభవంగా సాగింది. చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో సంస్థ ప్రతినిధులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం పాటకు విశేష స్పందన లభించింది. అనంతరం విఘ్నేశ్వరునికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. విజయవాడ ఆటోనగర్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపు మహోత్సవం ఎంతో వైభవంగా, కోలాహలంగా జరిగింది. చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంస్థ ప్రతినిధులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన లడ్డూ వేలం పాటకు విశేష స్పందన లభించింది. అనంతరం
గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ ధోనేపూడి దుర్గారావు, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) నాగేశ్వరరావు, డైరెక్టర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం ప్రారంభమైన ఊరేగింపులో వారు స్వయంగా పాల్గొని భక్తులతో కలిసి అడుగులు వేశారు. ఊరేగింపు పొడవునా సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల కోలాట నృత్య ప్రదర్శనలు, ఒళ్లు గగుర్పొడిచే భేతాళ నృత్యాలు, హోరెత్తించే డప్పు వాయిద్యాల నడుమ ర్యాలీ ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. భక్తుల జయ జయధ్వానాలు, ఆధ్యాత్మిక సందడితో ఆటోనగర్ వీధులన్నీ మారుమోగాయి.