ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న వెదిరే మేఘారెడ్డి
ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న వెదిరే మేఘారెడ్డి
???? బోయపర్తి లక్ష్మమ్మ కి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత
మునుగోడు,మేజర్ న్యూస్:
మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన బోయపర్తి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందారు.విషయం తెలుసుకున్న వెదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మేఘారెడ్డి ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనో ధైర్యం కల్పించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, లక్ష్మమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోయపర్తి లింగయ్య,జీడిమడ్ల దశరథ, సంకు శంకర్, జాల శివ,బోయపర్తి గణేష్,గ్రామస్తులు పాల్గొన్నారు.