BREAKING
సినిమా పరిశ్రమలో వర్చువల్ ప్రింట్ ఫీ (VPF) వివాదం.. కాంపిటీషన్ కమిషన్ కీలక ఆదేశాలు ప్రభాస్ అభిమానులకు నిరాశ: డిసెంబర్ 3కి వాయిదా పడిన 'ఫౌజీ' సినిమా విడుదల! టాలీవుడ్‌లో కొత్త సంచలనం: దర్శకుడిగా మారుతున్న 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ! *వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మిర్యాలగూడ, మేజర్ న్యూస్: మిర్యాలగూడనియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఇసుకబావి గూడెంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య - సునీత దంపతుల ఆధ్వర్యంలో తాడిగడప, ఉయ్యూరులో వైసీపీ గెలిస్తే రాజీనామా చేస్తా: బోడే ప్రసాద్ నేడు వైకాపా నీటి పోరు..! శభాష్ జీవీఎంసీ! అక్రమ ‘యమలోకం’ పీటలు కదిలించిన అధికారులు అక్టోబర్ 20 నుంచి అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రాత్మక FTA ఒప్పందం ఆసియా క్రీడల్లో బోణీ కొట్టిన భారత మహిళల కబడ్డీ జట్టు ద్రవ్య లభ్యత నిర్వహణలో భాగంగా OMO ద్వారా రూ. 25,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించిన RBI ఆయుర్వేద దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా 9,700కు పైగా కార్యక్రమాలు సోవా-రిగ్పా ఫార్మకోపియా అభివృద్ధికి శ్రీకారం పేద దేశాల కోసం రుణ చట్రంలో మార్పులు చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు అంతర్-రాష్ట్ర మండలి ఉత్తర్వు 1990కి సవరణ

తాడిగడప, ఉయ్యూరులో వైసీపీ గెలిస్తే రాజీనామా చేస్తా: బోడే ప్రసాద్

Select Suryaa Now
తాడిగడప, ఉయ్యూరులో వైసీపీ గెలిస్తే రాజీనామా చేస్తా: బోడే ప్రసాద్

తాడిగడప మున్సిపాలిటీ, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో ఏదో ఒక మున్సిపాలిటీలో వైసీపీ గెలిస్తే తాను రాజీనామా చేస్తానని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సవాల్ చేశారు. వైసీపీ నాయకులు ప్రగల్భాలు పలకకుండా అభ్యర్థులను బరిలోకి దించి ప్రజల తీర్పును ఎదుర్కోవాలని అన్నారు.

పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.70 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో పెనమలూరు నియోజకవర్గంలో సుమారు రూ.25 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

గత ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్, మద్దూరు–ఉప్పులూరు రహదారి వంటి పనులను పూర్తి చేశామని, కుందేరు అభివృద్ధికి నిధులు తీసుకొచ్చామని చెప్పారు. సుమారు రూ.105 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

తనను “రీల్ స్టార్” అంటూ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, “నేను రీల్ స్టార్‌నే.. మరి మీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి సోషల్ మీడియాలో రీల్స్ ఎందుకు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. సినిమా డైలాగులు, రాజకీయ డ్రామాలు కాకుండా అభివృద్ధి, సంక్షేమమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఓవర్‌లోడ్ లారీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు గతంలోనే సూచించినట్లు తెలిపారు. ప్రజలు అమాయకులు కాదని, పనిచేసే ప్రభుత్వంపై తమ నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సులో చూపిస్తారని బోడే ప్రసాద్ అన్నారు.