BREAKING
ప్రభాస్ అభిమానులకు నిరాశ: డిసెంబర్ 3కి వాయిదా పడిన 'ఫౌజీ' సినిమా విడుదల! టాలీవుడ్‌లో కొత్త సంచలనం: దర్శకుడిగా మారుతున్న 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ! *వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మిర్యాలగూడ, మేజర్ న్యూస్: మిర్యాలగూడనియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఇసుకబావి గూడెంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య - సునీత దంపతుల ఆధ్వర్యంలో తాడిగడప, ఉయ్యూరులో వైసీపీ గెలిస్తే రాజీనామా చేస్తా: బోడే ప్రసాద్ నేడు వైకాపా నీటి పోరు..! శభాష్ జీవీఎంసీ! అక్రమ ‘యమలోకం’ పీటలు కదిలించిన అధికారులు అక్టోబర్ 20 నుంచి అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రాత్మక FTA ఒప్పందం ఆసియా క్రీడల్లో బోణీ కొట్టిన భారత మహిళల కబడ్డీ జట్టు ద్రవ్య లభ్యత నిర్వహణలో భాగంగా OMO ద్వారా రూ. 25,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించిన RBI ఆయుర్వేద దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా 9,700కు పైగా కార్యక్రమాలు సోవా-రిగ్పా ఫార్మకోపియా అభివృద్ధికి శ్రీకారం పేద దేశాల కోసం రుణ చట్రంలో మార్పులు చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు అంతర్-రాష్ట్ర మండలి ఉత్తర్వు 1990కి సవరణ రూఫ్‌టాప్ సోలార్ కోసం 'ఢిల్లీ పీఎం సూర్య ఘర్' పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేఖా గుప్తా

వినాయక నిమజ్జన ఏర్పాట్లను మరింత విస్తృతం చేయాలి : వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

Select Suryaa Now
వినాయక నిమజ్జన ఏర్పాట్లను మరింత విస్తృతం చేయాలి : వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ కార్పొరేషన్సెప్టెంబరు 21, మేజర్ న్యూస్ : వినాయక నిమజ్జన ఏర్పాట్లను మరింత విస్తృతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం వన్‌టౌన్‌ సీతమ్మవారి పాదాల వద్ద జరుగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనానికి చివరి రోజులు కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పూజా సామగ్రివ్యర్థాలను విగ్రహాల నుంచి వేరు చేసి సేకరించే పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలనిఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జన ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన తాగునీరువైద్య శిబిరాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్‌ ఇంజనీర్‌ పి. సత్యకుమారిచీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సి.హెచ్. నిర్మల గ్లోరీఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జె. శ్రీనివాస్సిబ్బంది పాల్గొన్నారు.