BREAKING
కొర్రపాటి కిరణ్ జన్మదిన సందర్భంగా దివ్యాంగులకు గృహపకరణాలు పంపిణీ ఆర్థిక సాయం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి రూ.1,789.52 కోట్లతో ఐటీఎంఎస్‌.. 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లలో అమలు హరిహరులను విభజించే హక్కు ఎవరిచ్చారు కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాఫీ విత్ కరణ్ షోకు తెరదించిన కరణ్ జోహార్.. సెలెబ్రిటీ కెరీర్‌లను ముగించిన ఐకానిక్ టాక్ షో ముగింపు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల ఆరోపణలు

Select Suryaa Now
అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల ఆరోపణలు

ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు పట్టణ ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బుధవారం పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పనులు కోర్టు కేసు కారణం తో పనులు ప్రారంభించలేదనిఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీతో చిరు వ్యాపారులు కోర్టు కేసు ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేచిరువ్యాపారులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా కాలయాపన తోనే కేసుకొనసాగాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిరు వ్యాపారులతో సమావేశమై షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో చిరు వ్యాపారులు కోర్టు కేసునుఉపసంహరించుకున్నారని తెలిపారు. పట్టణ కేంద్రంలో కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో కౌన్సిలర్ అనిత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మండ్లి రాములు, కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖాదర్, మార్కెట్ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం,  మాజీ ఎంపీపీ అనిత విజయ్ నాయక్, ఆదివాసి రాష్ట్ర కో ఆర్డినేటర్ కృష్ణ నాయక్, నాయకులు పర్వతాలు, గాజుల శ్రీను, కాలే మల్లయ్య, బాబా, సురేష్, ఎంగలి ప్రసాద్, ఒగ్గు మహేష్, వెంకటేశ్ రెడ్డి, అండెకార్ రాజు, ఆలీం, కొండల్ రెడ్డి, వస్పుల శ్రీకాంత్, ఫరీద్, రాఘవేందర్, శ్రీను నాయక్, ఫిరోజ్, కొప్పు శ్రీశైలం, శివ తదితరులు ఉన్నారు.
ఎ. చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.