ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సాధ్యం
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
అమనగల్లు రంగారెడ్డి:
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సాధ్యమని టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని మంగళపల్లి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతుండడం గ్రామ ఐక్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకొని ప్రశాంతత తో జీవించాలని ఆయన సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో ఆనందంగా జీవించాలని, పండుగలను ప్రతి ఒక్కరు ఐకమత్యంతో కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక, ఉప సర్పంచ్ శ్రీను, వార్డు సభ్యులు రాఘవేందర్, వెంకటేశ్వర్లు, ప్రభు లింగం, జంగయ్య, శ్రీశైలం, అయోధ్య, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, శ్రీకాంత్, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎ, చంద్రశేఖర్ మేజర్ న్యూస్.