కివీస్ స్కోర్ 180/5!
క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఆరంభంలో భారత బౌలర్లు దెబ్బకొట్టినా, గ్లెన్ ఫిలిప్స్ (70) మరియు బెవోన్ జాకోబ్స్ (58) అద్భుతమైన అర్ధశతాలతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు తలా ఒక వికెట్ సాధించారు.