BREAKING
హెచ్-1బీ నుంచి పీఈఆర్‌ఎం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ఉద్యోగుల సంఖ్య పరిమితమే: నాస్కామ్ కీలక ప్రకటన! ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు అర్హులైన ప్రతి ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలి..జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మహేష్ కుమార్ గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

పెనమలూరు వంతెనలపై మృత్యు క్రీడ

Select Suryaa Now
పెనమలూరు వంతెనలపై మృత్యు క్రీడ

రక్షణ కంచెలు లేవు.. హెచ్చరిక బోర్డులు లేవు.. అత్యవసర స్పందనా వ్యవస్థ లేదు
ఏడాదిలోనే దాదాపు ఐదుగురు మృతి.. ప్రమాదాలు, ఆత్మహత్యలకు అడ్డుకట్ట ఏదీ?
అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు బలవుతున్నాయా?

పెనమలూరు, మేజర్ న్యూస్ : పెనమలూరు పరిధిలోని వంతెనలు మృత్యు ఉచ్చులుగా మారుతున్నాయి. వంతెనలపై కనీస రక్షణ కంచెలు లేకపోవడంతో ప్రమాదాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటివరకు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలోనే దాదాపు ఐదుగురు వంతెనల వద్ద చోటుచేసుకున్న ఘటనల్లో మృత్యువాత పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా పెనమలూరు వంతెన, పప్పుల మిల్లు సెంటర్‌ నుంచి తాడిగడప డొంక రోడ్డు వైపు వెళ్లే వంతెనల వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వంతెనలకు రక్షణ కంచెలు లేకపోవడంతో కాలువ వైపు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండటం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది. అదే సమయంలో క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడాలని భావించే వారికి కూడా వంతెనల పరిస్థితి అనుకూలంగా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో సకాలంలో స్పందించేందుకు అవసరమైన అత్యవసర సేవల వివరాలు కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

అత్యవసర నంబర్లతో హెచ్చరిక బోర్డులు

వంతెనలకు ఇరువైపులా పెద్ద పరిమాణంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది, సమీప పోలీస్‌స్టేషన్‌, గజ ఈతగాళ్లు, జాతీయ విపత్తు స్పందన దళం సిబ్బంది సంప్రదింపు నంబర్లను బోర్డులపై స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరిని సంప్రదించాలో ప్రజలకు తెలిసేలా బోర్డులు ఉండటంతో పాటు, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించే విధంగా వాటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి

వంతెనలపై రక్షణ కంచెలు లేకపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా కాలువలోకి జారిపడే ప్రమాదాన్ని నివారించేందుకు వంతెనలకు ఇరువైపులా తగిన ఎత్తులో పటిష్టమైన రక్షణ కంచెలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం ద్వారా క్షణికావేశంలో తీసుకునే ప్రాణాంతక నిర్ణయాలను కొంతమేర అడ్డుకోవడంతో పాటు ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోవడాన్ని కూడా నివారించవచ్చని చెబుతున్నారు.

మెట్ల మార్గానికి గేటు ఏర్పాటు చేయాలి

వంతెన వద్ద కాలువలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మెట్ల మార్గం వద్ద కూడా గేటు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బంది మినహా ఇతరులకు లోపలికి ప్రవేశం లేకుండా గేటును ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గం అందుబాటులో ఉండటంతో ఎవరైనా సులభంగా కాలువ వద్దకు చేరుకునే అవకాశం ఉందని, ఇది ప్రమాదాలకు మరింత అవకాశం కల్పిస్తోందని అంటున్నారు.

కాలువ కాలుష్యానికీ అడ్డుకట్ట

వంతెనలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాల నివారణతో పాటు బందరు కాలువలో చెత్త, వ్యర్థాలు వేయడాన్ని కూడా అరికట్టవచ్చని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వంతెనలపై నుంచి నిత్యం ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వ్యర్థాలను కాలువలోకి పడేస్తుండటంతో కాలువ కాలుష్యానికి గురవుతోంది. తగిన ఎత్తులో రక్షణ కంచెలు ఏర్పాటు చేసి, అవసరమైన చోట్ల జాలీలు ఏర్పాటు చేస్తే కాలువలోకి చెత్త వేయడాన్ని కూడా కొంతమేర నియంత్రించవచ్చని అంటున్నారు.

ఇకనైనా అధికారులు మేల్కొనాలి

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడాదిలోనే దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారులు ఇకనైనా మేల్కొనాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు. పెనమలూరు, పప్పుల మిల్లు సెంటర్‌–తాడిగడప డొంక రోడ్డు మార్గంలోని వంతెనలను అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి, వెంటనే పటిష్టమైన రక్షణ కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు, అత్యవసర సంప్రదింపు నంబర్లు, మెట్ల మార్గానికి గేటు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు చేపడితే ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, మరిన్ని ప్రాణాలు పోకుండా నివారించవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

✍️ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.