కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.62.50 పెంచారు. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,837.50కు చేరింది.
ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఇతర వాణిజ్య వినియోగదారులపై అదనపు భారం పడనుంది.