ఎన్నికల సంఘం తీరుపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
న్యూ ఢిల్లీ :కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీరుపై మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గణేష్ నిమజ్జనం ముగిసింది.. ఇక జ్ఞానేష్ విసర్జన కావాలి" అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేష్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక వివాదం లేదా అవాంతరం జరుగుతూనే ఉందని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహించే 'SIR' (Special Intensive Revision) అంటే ఏంటో ప్రజలకు ఏమైనా స్పష్టత ఇచ్చారా అని ప్రశ్నించారు.
అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం వల్లే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రయోజనం పొందిందని ఆరోపించిన ప్రకాష్ రాజ్, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలకు వచ్చేసరికి ప్రజలు అప్రమత్తమై ఆ యత్నాలను తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఇన్ని లక్షల మంది ఓట్లు తొలగించబడుతున్నా, దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య సమస్య జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు.